Ticket to Finale: అవినాష్ కి టికెట్ టు ఫినాలే.. ఎంటర్‌టైనర్ కాదు గేమర్!
on Nov 29, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీక్ అంటే ఇదేనేమో. గత అయిదు రోజుల నుండి సాగుతున్న టికెట్ టు ఫినాలే క్లైమాక్స్ కి వచ్చేసింది. మొదటగా కంటెండర్ షిప్ సాధించిన అవినాష్ కే టికెట్ టు ఫినాలే వచ్చేసింది.
హౌస్ లో నిఖిల్, నబీల్, పృథ్వీ లాంటి గేమర్స్ ఉన్నప్పటికి అవినాష్ కు టికెట్ టు ఫినాలే రావటంతో అతను జస్ట్ కమేడియన్ కాదు గేమర్ అని అతని ఆటతో నిరూపించాడు. ఒక్కటి కాదు రెండు సార్లు మెగా ఛీఫ్ అయిన అవినాష్.. ఈ వారం జరిగిన రెండు టాస్క్ లో గెలిచి మొదటి కంటెండర్ గా నిలిచాడు. రోహిణి, అవినాష్, నిఖిల్, టేస్టీ తేజ టికెట్ టు ఫినాలేకి అర్హత ఫైనల్ బాటిల్ లో అవినాష్ గెలిచినట్టు తెలుస్తోంది. ఈ సీజన్-8 లో ఎవరి అంచనాలకి అందకుండా అవినాష్ ఆడుతున్నాడు.. హౌస్ లో ఏ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ అయిన అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఇరగదీస్తున్నారు. వీళ్ళ కామెడీ కోసం బిగ్ బాస్ సీజన్-8 కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
అయితే కొంతమంది అసలు బిగ్ బాస్ రెగ్యులర్ గా చూడకుండా అసలు గేమ్ ఆడని, ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వని పృథ్వీ, విష్ణుప్రియలకి ఓట్లు వేస్తున్నారు. ఇక నబీల్ గేమ్ లో అట్టడుగునకి చేరాడు. ఇమ ఈ వారం రోహిణి తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు. వారిలో నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ లో ఉండగా.. లీస్ట్ లో అవినాష్, టేస్టీ తేజ ఉన్నారు. పృథ్వీ, విష్ణుప్రియల లవ్ ట్రాక్ కోసం బిగ్ బాస్ మామ ఫేక్ ఓటింగ్ వేస్తున్నాడనే అనుమానాలున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తూ అటు గేమ్స్ లో తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న అవినాష్, రోహిణిలకి ఓటింగ్ రావడం లేదు. టికెట్ టు ఫినాలేకి చేరుకున్న అవినాష్.. ఈ వారం నామినేషన్ లో నుండి సేవ్ అయితేనే ఉంటాడు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు వినిపిస్తుండగా.. ఎవరు బయటకు వస్తారోనని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read